Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, జికె మోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటుంది.
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయని, చిరంజీవి, రవితేజలని కలసి తెరపై చూడటం పండగలా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ని అభినందించారు. ఇక ఈ టాక్ తో సినిమా ఎలా ఉండబోతుంది అనేది అభిమానులే ఒక అంచనా వేసేసుకున్నారు. పూనకాలు లోడింగ్ అంటూ ఊగిపోతున్నారు. చిరును మాస్ లుక్ లో చూసినప్పుడే సినిమా టాక్ అర్థమైందని, సినిమా థియేటర్ లో సీట్లు చిరగడం ఖాయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా దాటుతుందో లేదో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
