Site icon NTV Telugu

Wakanda Forever: బాట్మాన్, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్‌ని బీట్ చేసిన వకాండా ఫరెవర్

Wakanda Forever Collections

Wakanda Forever Collections

Wakanda Forever Beats Batman Multiverse Of Madness Records: మార్వెల్ స్టూడియోస్ నుంచి బ్లాక్‌పాంథర్ సీరీస్‌లో భాగంగా వచ్చిన సెకండ్ ఔటింగ్ ‘వకాండా ఫరెవర్’ (Wakanda Forever). MCU ఫోర్త్ ఫేజ్‌లో వచ్చిన లాస్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న వకాండా ఫరెవర్.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులని ఆకట్టుకుంటోంది. చాడ్విక్ బోస్మెన్ చనిపోయిన తర్వాత కింగ్ ప్లేస్‌ని ఎవరు ఎలా రిప్లేస్ చేస్తారో అనే ఆలోచనతో థియేటర్‌కి వచ్చిన ఆడియన్స్ వకాండా ఫరెవర్ సినిమాని సూపర్ హిట్ చేశారు. రైట్ (Letitia Wright), లుపితా (Lupita Nyong’o), డానై గురిరా (Danai Gurira), విన్స్టన్ డూక్ (Winston Duke), ఫ్లోరెన్స్ కాసుంబా (Florence Kasumba) నటించిన వకాండా ఫరెవర్ సినిమా చూసిన ఆడియన్స్.. వార్ ఎపిసోడ్స్‌లోని విజువల్స్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో MCU నుంచి వచ్చిన సినిమాల్లో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉన్న సినిమాగా కూడా వకాండా ఫరెవర్ పేరు తెచ్చుకుంది.

ఈ మూవీ ఇప్పటివరకూ(9 రోజుల్లో) 546 మిలియన్ డాలర్స్‌ని రాబట్టింది. కేవలం సెకండ్ వీక్‌లోనే 67.3 మిలియన్ డాలర్స్‌ని రాబట్టి బాట్మాన్(Batman)($66M), మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్(Multiverse of Madness)($61M) రికార్డులని బ్రేక్ చేసింది. వకాండా ఫరెవర్, ఈ ఏడాదిలో సెకండ్ వీక్ అత్యధిక వసూళ్లు సాధించిన కామిక్ చిత్రాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. స్పైడర్‌మాన్ నో వే హోమ్ సినిమా 84 మిలియన్ డాలర్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఓవరాల్‌గా ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాల లిస్ట్ తీస్తే వకాండా ఫరెవర్ థర్డ్ ప్లేస్‌లో ఉండగా, 90 మిలియన్ డాలర్స్ వసూల్ చేసి ‘టామ్ క్రూజ్’ నటించిన ‘టాప్ గన్ మవెరిక్'(Top Gun Maverick) సినిమా మొదటిస్థానంలో ఉంది.

Exit mobile version