NTV Telugu Site icon

Vyjayanthi Movies: ఎన్టీఆర్ నుంచి నాని వరకూ అందరినీ వాడేస్తున్నారు…

Vyjayanthi Movies

Vyjayanthi Movies

ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలకి, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన బ్యానర్ వైజయంతి మూవీస్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నందినీ రెడ్డి డైరెక్ట్ చేసింది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ మే 18న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మాళవిక నాయర్ హీరోయిన్ గా, రాజేంద్ర ప్రసాద్, గౌతమీ, రావు రమేష్ లాంటి ఆర్టిస్టుల ప్యాడింగ్ తో అన్నీ మంచి శకునములే సినిమా తెరకెక్కింది. ఈ మూవీతో సంతోష్ శోభన్ కి మంచి హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయిన మేకర్స్, అన్నీ మంచి శకునములే సినిమాని ఫుల్ స్వింగ్ లో ప్రమోట్ చేస్తున్నారు. టూర్స్, షోస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లకి వెళ్లి మరీ అన్ని మంచి శకునములే సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోష్ పెంచిన వైజయంతి మేకర్స్ అండ్ టీం, స్టార్ హీరోలని రంగంలోకి దించింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు.

Read Also: Prabhas: ఈ రేర్ రికార్డ్ ఉన్న ఏకైక హీరో ‘ప్రభాస్’…

ఈ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లాంచ్ కోసం ఎన్టీఆర్ కి వాడిన మేకర్స్ లేటెస్ట్ గా నాని, దుల్కర్ సల్మాన్ లతో కూడా అన్నీ మంచి శకునములే ప్రమోషన్స్ చేయించడానికి రెడీ అయ్యారు. మే 14న సాయంత్రం 6 గంటలకి జరగనున్న అన్నీ మంచి శకునములే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి నాని, దుల్కర్ సల్మాన్ లు చీఫ్ గెస్టులుగా రానున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ వైజయంతి మూవీస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. “మా సుబ్బు, మా రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారు” అంటూ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్, నాని, దుల్కర్ సల్మాన్ లతో వైజయంతి మూవీస్ సినిమాలు చేసింది. ఆ రిలేషన్ తోనే ఈ హీరోలు అన్నీ మంచి శకునములే సినిమాలని ప్రమోట్ చెయ్యడానికి ముందుకొస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎంత వరకూ మెప్పిస్తుంది? సంతోష్ శోభన్ కి హిట్ దొరుకుతుందా లేదా అనేది తెలియాలి అంటే మే 18 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Show comments