Site icon NTV Telugu

Vrushabha: ముంబైలో ‘వృషభ’ కొత్త షెడ్యూల్.. రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఖరారు

Vrushabha

Vrushabha

Vrushabha Movie New schedule started in Mumbai: తెలుగు హీరో శ్రీకాంత్ కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’… ‘ది వారియర్ అరైజ్’ అనేది ట్యాగ్ లైన్. శనయ కపూర్‌, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతోన్నారు. రోజు రోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది.

LEO : లియో మూవీ నుంచి నా రెడీ సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది..

అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ భారీ షెడ్యూల్‌ను షూట్ చేసే విధంగా మేకర్స్ సన్నాహాలు చేశారు. ఈ క్రమంలోనే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు కూడా దర్శక నిర్మాతలు ప్రకటించారు. వృషభ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు సినీ లవర్స్, ట్రేడ్ వర్గాల్లో కూడా క్రియేట్ కాగా దసరా రోజున ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. రోషన్ మేకా, మోహన్ లాల్, శనయ కపూర్, జహ్రా ఖాన్, శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన హాలీవుడ్ కి చెందిన నిక్ తుర్లో నిక్ తుర్లోని ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తుండటం విశేషం.

Exit mobile version