NTV Telugu Site icon

VNR Trio: ఆ గన్నులు ఏంటి? బాణం ఏంటి? అసలు ఏం చేస్తున్నారు నితిన్ అన్న…

Vnr Trio

Vnr Trio

భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్, రష్మిక, వెంకీ కుడుముల ఒక సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి వచ్చి మరీ లాంచ్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీ నుంచి నితిన్ బర్త్ డే రోజున స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చింది. ప్రీలుక్ పోస్టర్ గా బయటకి వచ్చిన ఈ పోస్టర్ ని వెంకీ కుడుముల కొన్ని హిడెన్ డీటెయిల్స్ ని పెట్టాడు. ఒక సిటీ బ్యాక్ డ్రాప్ లో, గన్ అండ్ యారోని రివర్స్ లో ఉండేలా… కాస్త డీప్ గా చూస్తేనే అర్ధం అయ్యేలా పోస్టర్ ని డిజైన్ చేశారు. ‘VNRTrio’ అనౌన్స్మెంట్ వీడియోలోనే ఈసారి అంతకు మించి, ఇది వేర మాదిరి అంటూ వెంకీ కుడుముల చెప్పాడు. ఆ వెరైటీని పోస్టర్ నుంచే చూపించడం మొదలుపెట్టారు మేకర్స్. మరి ఆ గన్స్ ఏంటో? బౌ అండ్ యారో ఏంటో? నితిన్ యాక్షన్ సినిమా చేస్తున్నాడా? వెంకీ కుడుముల కామెడీ వదిలి కమర్షియల్ మోడ్ లోకి వచ్చాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికైతే నితిన్ బర్త్ రోజు వదిలిన ఈ పోస్టర్ తో సినీ అభిమానులకి ‘VNRTrio’ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీ పెంచారు.

Read Also: Ramabanam: నిజమైన రామ లక్ష్మణుల్లా ఉన్నారు…

Show comments