బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన మంచితనంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ప్రస్తుతం బాలీవుడ్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించనున్నారు. ఇక వివేక్ ఒబెరాయ్ విభీషణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తాజాగా తన పాత్రకు సంబంధించిన పారితోషికంపై వివేక్ చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read : The Family Man 3 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ – సీక్రెట్ మిషన్ మొదలు!
ఈ సినిమాకు తీసుకునే పూర్తి పారితోషికాన్ని క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. “నా జీవితంలో నేను చేసే ప్రతి పని ప్రేమతోనే చేస్తాను. ‘రామాయణం’ ద్వారా నాకు వచ్చే పారితోషికం మొత్తం క్యాన్సర్ పిల్లల చికిత్సకు వినియోగించాలని నిర్ణయించుకున్నాను. నిర్మాత నమిత్ మల్హోత్రా గారికి కూడా నేను స్పష్టంగా చెప్పాను ఈ సినిమా కోసం నాకు ఒక్క పైసా కూడా వద్దు, ఇది నా మనసుకు దగ్గరైన ఒక కారణం కోసం” అని వివేక్ చెప్పారు. వివేక్ ఈ నిర్ణయంపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుమారు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ‘రామాయణం’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
