Vivek Kuchibhotla Responds on Adipurush Ravan Look Trolling: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. ఓం రౌత్ డైరెక్షన్లో టీ సిరీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిభొట్ల రావణుడి లుక్ పై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ విషయానికి వస్తే చిన్న పిల్లలకు అర్ధమేయ్యేలా ఒక సినిమా తీయాలి, రామాయణం అంటే పాతకాలంలో లాగా సంస్కృత పద్యాలూ, పదాలతో ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా మీరే అప్డేట్ అవ్వండిరా అని అంటారు, సో అప్డేట్ అయ్యి ఒక సినిమా చేస్తే వాళ్లు ఏంటి ఇలా ఉన్నారు? రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు అని అంటున్నారని అన్నారు.
Raashii Khanna: అందాల ‘రాశి’ హీటెక్కించి చంపేస్తోందే!
అంటే మీరు చూడలేదు నేను చూడలేదు, మీ ఊహకు మీరు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నారు, మేము ఒకలా ఊహించుకున్నామని ఆయన అన్నారు. కానీ ఎక్కడా చరిత్రను పక్కదోవ అయితే ఈ సినిమాలో పట్టించలేదు, రాముడు ధీరోదాత్తుడు, రాముడు సకల గుణాభిరాముడు అనే చూపించారు. మంచి చెప్పడానికి షుగర్ కోటెడ్ గా ఇలా చేశామని ఆయన అన్నారు. ఈరోజు పిల్లలకు ఒక హల్క్ తెలుసు, ఒక థోర్ తెలుసు, డిస్నీ క్యారెక్టర్లు అన్నీ తెలుసు. కానీ వీళ్లకు జాంబవంతుడు అంటే తెలుసా? సుగ్రీవుడు అంటే తెలుసా? అంగదుడు అంటే తెలుసా? తెలియదు. ఒక బ్యాట్ మ్యాన్ అంటే వెంటనే గుర్తు పడతారు కానీ అంగదుడు అంటే ఎవరూ గుర్తు పట్టరు. ఈరకంగా అయినా మన పిల్లలకి రామాయణం గురించి తెలిసే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు.
Adipurush: రావణుడి లుక్‌పై ట్రోలింగ్.. మైండ్ బ్లాకయ్యే సమాధానమిచ్చిన నిర్మాత!
Show comments