Vivek Athreya : నాని తో ఆ జానర్ లో సినిమా తీసి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేదేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరో గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన మూవీ ‘అంటే.. సుందరానికీ!.. ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించగా తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో 2022 లో విడుదల అయ్యింది.ఈ చిత్రానికి ముందు నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ వంటి వరుస సినిమాల తో హిట్ కొట్టి మంచి ఫామ్ లో వున్నాడు.. దీనికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించడం తో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అలాగే ఈ సినిమా లో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా కనటించడం మరో ఇంటరెస్టింగ్ విషయం. అయితే ఈ మూవీ విడుదల అయిన తరువాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.
మూవీ చూడటానికి బాగున్న కూడా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయింది. ఒక బ్రాహ్మణ కుర్రాడు మరియు ఒక క్రిస్టియన్ అమ్మాయి మధ్య ప్రేమ కథని దర్శకుడు ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు.. అయితే మైత్రీ నిర్మాణంలో నానితో సినిమా ఒకే అయ్యినప్పుడు.. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ముందుగా ఒక హారర్ థ్రిలర్ స్టోరీ చెప్పాడట.ఆ స్టోరీ బాగున్న కూడా మైత్రీ నిర్మాతలు ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనింగ్ స్టోరీ కావాలని దర్శకుడిని కోరడం తో ‘అంటే.. సుందరానికీ!’ కథ రాసి దానిని తెరకెక్కించడం జరిగిందని ఒక ఇంటర్వ్యూ లో వివేక్ చెప్పుకొచ్చారు.అయితే. ఒకవేళ వివేక్ చెప్పిన హారర్ కథ తో సినిమా తీసి ఉంటే కనుక సినిమా నిజంగా హిట్ అయ్యి ఉండేదని నాని అభిమానులు భావిస్తున్నారు.. అయితే నాని అండ్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో మరో మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.ఈ క్రమంలో నాని తో ముందుగా చేద్దామనుకున్న హారర్ కథను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!