Site icon NTV Telugu

Vivek Agnihotri: ఇందిరా గాంధీ కనుక కశ్మీర్ ను కాపాడి ఉంటే.. నేను ఆ పని చేసేవాడిని కాదు

Vivek

Vivek

Vivek Agnihotri: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశం మొత్తం అగ్గిరాజేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయనకు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం ఏదో ఒక వివాదంలో వివేక్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ట్విట్టర్ లో వివేక్ చేసే ట్వీట్స్ అయితే ఎన్నో సంచలనాలకు దారితీసాయి కూడా. ఇక తాజాగా ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు. ఇటీవలే రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దయ్యింది విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదసప దర్శకుడు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ” రాహుల్ గాంధీ రాజకీయాలకు అనర్హుడు. రాజకీయాల్లో అర్హత లేని నేత రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం అధికారికంగా రుజువైంది” అంటూ ఒక ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.

Ravi Kishan: ఆమె నన్ను రాత్రికి రమ్మంది.. అల్లు అర్జున్ విలన్ షాకింగ్ కామెంట్స్

మరో ట్వీట్ లో.. ఇందిరా గాంధీను కూడా లాక్కొచ్చాడు. ” గతంలో ఇందిరా గాంధీపై కూడా అనర్హత వేటు పడింది. కానీ, ఆమె నిజాయితీ గల నేత కాబట్టి తిరిగి అగ్రనేతగా నిలబడింది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ తిరిగి పుంజుకునే అవకాశం లేదు. ఒకవేళ ఇందిరా గాంధీ కనుక కశ్మీర్ ను కాపాడి ఉంటే నేను కశ్మీర్ ఫైల్స్ తీసేవాడిని కాదేమో” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో హీట్ పుట్టిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version