NTV Telugu Site icon

Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికేంటి? ఎవడ్రా రాసింది ఇది?

Prabhas Vs Vivek Agnihotri

Prabhas Vs Vivek Agnihotri

Vivek Agnihotri Responds on social media viral news: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ అవలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ కూడా బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడ్డాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే రాధేశ్యామ్‌ రిలీజైన రోజు వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా కూడా విడుదలై దుమ్ము దులిపేసింది. ఇక వివేక్‌ అగ్నిహోత్రి తాజాగా ఆదిపురుష్‌ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందనే విషయం మీది కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజల నమ్మకాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు మీక్కూడా దానిపై విశ్వాసం ఉండాలి లేదంటే ఆ సబ్జెక్ట్‌లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉండాలని, దురదృష్టవశాత్తూ భారత్‌లో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చాడు.

Bhola Shankar Trailer: చిరు నట విశ్వరూపం..

ఇక ఆదిపురుష్‌ నటులను(ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రోల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ..) కొందరు స్క్రీన్‌పై వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నిజంగానే అతడు దేవుడయిపోతాడా? రోజూ రాత్రి ఇంటికి తాగి వచ్చి తెల్లారి నేను దేవుడిని, నన్ను నమ్మండి అని చెప్తే ఎవరూ నమ్మరని ఎందుకంటే జనాలేమీ పిచ్చోళ్లు కారని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అయితే ఆయన ఆ కామెంట్లు చేసిన మరుసటి రోజే ప్రభాస్ రాధేశ్యామ్ ను కాశ్మీర్ ఫైల్స్ తో ఓడించా ఆయన మరో సినిమాను నా వాక్సిన్ వార్ సినిమాతో ఓడిస్తా అనే కామెంట్ చేసినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవ్వగా ఈ విషయం మీద వివేక్‌ అగ్నిహోత్రి స్పందించాడు. నేను అన్నట్టుగా నకిలీవార్తలు నాకు ఆపాదిస్తూ ఇలాంటి తప్పుడు విషయాలను ఎవరు ప్రచారం చేస్తున్నారు? మెగా మెగాస్టార్‌గా మెగా బడ్జెట్‌ సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ అంటే నాకు చాలా గౌరవం, అయితే మేము నాన్ స్టార్టర్, స్మాల్ బడ్జెట్, పీపుల్స్ సినిమాలు తీస్తాము, అందువల్ల మా మధ్య ఎలాంటి పోలిక లేదు, దయచేసి నన్ను వదిలేయండి అని ఒక ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్ దెబ్బకు వివేక్‌ అగ్నిహోత్రి సారీ చెప్పాడు రా అని ప్రభాస్ ఫాన్స్ అంటుంటే ఆయన సారీ చెప్పినట్టు లేదని కావాలని ఎద్దేవా చేసినట్టు ఉందని నెటిజన్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.