Site icon NTV Telugu

Vivek Agnihotri: అప్పుడు కాశ్మీర్ ఫైల్స్… ఇప్పుడు కోవిడ్ వైరస్…

The Vaccine War

The Vaccine War

గతేడాది డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చేసి పాన్ ఇండియా మొత్తం ఒక సంచలనానికి తెర తీసాడు. కాశ్మీర్ పండిట్స్ పై జరిగిన దాడుల నేపథ్యంలో సినిమా చేసి పాన్ పాన్ ఇండియా హిట్ కొట్టిన వివేక్ అగ్నిహోత్రి. ఎన్నో విమర్శలని కూడా ఫేస్ చేసాడు, అది హిందూ పక్షపాత సినిమా అనే కామెంట్స్ ని కూడా వివేక్ ఫేస్ చేసాడు. పొగిడిన వాళ్ల కన్నా కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి తిట్టిన వాళ్లే ఎక్కువ. ఆ సినిమా రిజల్ట్ ఇచ్చిన జోష్ తో వివేక్ అగ్నిహోత్రి తన నెక్స్ట్ సినిమాని రెడీ చేసాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ‘ద వాక్సిన్ వార్’ టైటిల్ సినిమా చేసిన వివేక్ అగ్నిహోత్రి మరోసారి పాన్ ఇండియా హిట్ కొడతాను అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు.

ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ద వ్యాక్సిన్ వార్ సినిమాను 11 భాషల్లో నిర్మించి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ద్వారా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. కరోనా సమయంలో జరిగిన వ్యాక్సిన్ వార్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. నానా పటేకర్, సప్తమీ గౌడ, అనుపమ్ ఖేర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నారు. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తూ వివేక్ అగ్నిహోత్రి ఒక వీడియోని రిలీజ్ చేసాడు. మైం స్టార్ కాస్ట్ ని, వైరస్ ని చూపిస్తూ రిలీజ్ చేసిన ఈ వీడియో ఎండ్ లో సెప్టెంబర్ 28న ద వ్యాక్సిన్ వార్ సినిమా రిలీజ్ చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పేసారు. ‘మీకు తెలియని యుద్ధం మీరు పోరాడి గెలిచారు’ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ప్రభాస్ సలార్ రూపంలో భారీ కాంపిటీషన్ ఉంది. దాన్ని దాటి ద వ్యాక్సిన్ వార్ ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

Exit mobile version