Site icon NTV Telugu

Vishwambhara : అర్ధరాత్రి ‘విశ్వంభర’ ట్రీట్

Chiranjeevi

Chiranjeevi

Vishwambhara Pre-look Featuring Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి పలు అప్డేట్స్ రిలీజ్ చేయడానికి సినిమా టీం సిద్ధమైంది. అందులో భాగంగా సరిగ్గా 12 గంటల సమయంలో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అప్డేట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ అప్డేట్ ఏమిటి అనే విషయం మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోయినా ఒక చిన్న టీజర్ కట్ రిలీజ్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆంజనేయుడి ముందు గదతో విశ్వంభరుడు ఉన్న టీజర్ రిలీజ్ చేయబోతున్నారని చెబుతున్నారు. అయితే మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు టీజర్ కట్ ఇంకా చేయలేదని కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. వినాయక చవితికి టీజర్ రిలీజ్ చేస్తారని ఈరోజు రిలీజ్ చేయబోయేది పోస్టర్ అని అంటున్నారు.

Allu Arjun: పాత గాయం రేపేలా అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు??

ఆ పోస్టర్లో ఆంజనేయుడు ముందు గదతో విశ్వంభర నిలబడిన పోస్టర్ అయితే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక అర్ధరాత్రి 12 గంటల సమయంలో రిలీజ్ చేసిన పోస్టర్లో నదిని ఆనుకుని ఉన్న కొండమీద విశ్వంభరుడిగా మెగాస్టార్ ఆ కొండను ఎక్కుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తూ ఉండగా యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. త్రిష మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్గా నటిస్తోంది. మెగాస్టార్ చెల్లెళ్ళుగా పలువురు టాలీవుడ్ భామలు కనిపించబోతున్నారు. మొత్తానికి మెగా అభిమానులకు వశిష్ట అర్ధరాత్రి ట్రీట్ ఇచ్చాడు అని చెప్పవచ్చు.

Exit mobile version