Vishwak Vs Arjun: నేటి ఉదయం నుంచి విశ్వక్- అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. చెప్పాపెట్టకుండా సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ అంటుండగా.. నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేనని అందుకే బయటకు వచ్చానని విశ్వక్ చెప్పుకొస్తున్నారు. అసలు వీరి మధ్య గొడవలకు కారణం ఏంటి..? ఎందుకు విశ్వక్, అర్జున్ సినిమాలో మార్పులు చేయమంటున్నాడు అంటే.. ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. అవి ఏంటంటే.. విశ్వక్ సేన్ ఈ సినిమా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే రెమ్యూనిరేషన్ వద్దని, దాని ప్లేస్ లో నైజాం షేర్స్ ఇవ్వమని అడిగాడట. అలాగే ఒప్పందం కూడా కుదిరిందట.
ఇక అందుకు తగ్గట్టుగానే విశ్వక్ కు ముందే రూ. 50 లక్షల వరకు ఇచ్చారట. అయితే టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు నడుస్తాయి.. ఎలాంటి డైలాగ్స్ ఫేమస్ అవుతాయి అని ఐడియా ఉన్న విశ్వక్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడట. అందుకు అర్జున్ ఒప్పుకోలేదని విశ్వక్ అధికారికంగానే చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు ఇచ్చిన చెక్స్ ను కూడా ఫిల్మ్ ఛాంబర్ లో ప్రొడ్యూస్ చేశాడట. క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వలనే ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి అనేది నమ్మదగ్గ నిజం. మరి ఈ వివాదానికి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారు..? ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది అనేది తెలియాల్సి ఉంది.
