NTV Telugu Site icon

ట్రైలర్ : పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ “పాగల్” లవర్ స్టోరీ

Vishwak Sen’s Paagal Trailer out now

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “పాగల్”. కొత్త డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరి, నివేదా పేతురాజ్‌తో హీరోయిన్లుగా నటించారు. “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్” రూపొందుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల అనేక సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు 14 ఆగష్టున “పాగల్” విడుదలకు సిద్ధమయ్యాడు. సినిమా విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. రధన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

Read Also : తగ్గేదే లే : “పుష్ప” ఫస్ట్ సింగిల్ ప్రోమో

ట్రైలర్ లో విశ్వక్ ఇంతకుముందెన్నడూ కన్పించని పాత్రలో కన్పించాడు. నిజానికి ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అన్న విషయం పోస్టర్ తోనే స్పష్టమైనప్పటికీ ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచేసింది. హీరో దాదాపు 1600 మంది అమ్మాయిలను లవ్ చేయడం, ఆ తరువాత హీరోయిన్ తో సీరియస్ గా ప్రేమలో పడడం, వారిద్దరూ విడిపోవాల్సి రావడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కామెడీ, రొమాంటిక్, ఎమోషనల్ అంశాలను కూడా ట్రైలర్ లో కట్ చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Paagal Trailer - Vishwak Sen, Nivetha Pethuraj, Simran, Megha Lekha | Aug 14th Release