Site icon NTV Telugu

Vishwak Sen: అవును.. నచ్చలేదు.. బయటికి వచ్చేశా..?

Arjun

Arjun

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుకున్న విషయం విదితమే. నటుడు, డైరెక్టర్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా ఒప్పుకోవడం, మూడు నెలల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది. అయితే షూటింగ్ కు మాత్రం విశ్వక్ రాలేదని, ఏవేవో కారణాలు చెప్పి విశ్వక్ తప్పించుకొంటున్నాడని, సినిమా నుంచి బయటికి వచ్చినట్లు పుకార్లు వస్తున్నాయని, అందుకే విశ్వక్ నిజ స్వరూపం చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టినట్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అతని ప్రవర్తన తమ టీమ్ కు నచ్చలేదని, ఎన్నిసార్లు కాల్ చేసినా అతను స్పందించడం లేదని ఘాటు ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా అతనిపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు కూడా ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అర్జున్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి.

ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై విశ్వక్ స్పందించినట్లు తెలుస్తోంది. ” అవును.. ఈ సినిమా నుంచి నేను బయటికి వచ్చేశాను. సంభాషణలు, పాటలు, మ్యూజిక్‌ విషయంలో నేను సూచనలు చేసిన మాట వాస్తవమే.. కానీ ఆ చిన్న చిన్న మార్పులు చేయమన్నా కూడా అర్జున్ చేయలేదు. సెట్ లో అందరూ తాను చెప్పినట్లే నడుచుకోవాలని చెప్పేవాడు. నా మాటకు అస్సలు గౌరవం ఇచ్చింది లేదు. అందుకే నా మనసుకు నచ్చనిది నేను చేయలేక సినిమా నుంచి బయటకు వచ్చేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version