Vishwak Sen: చిత్ర పరిశ్రమ అన్నాక రీప్లేస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక కథని ఒక హీరో దగ్గరికి తీసుకెళ్లిన డైరెక్టర్ అతనినే ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ, కొన్నిసార్లు ఆ హీరోలు కథ నచ్చక లేకపోతే డేట్ అడ్జస్ట్ అవ్వక కథలను వద్దు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత డైరెక్టర్ మరో హీరోతో ఆ సినిమాను ఫినిష్ చేస్తూ ఉంటారు. ఇది చిత్ర పరిశ్రమంలో సాధారణమే. అయితే ఆ డైరెక్టర్ సినిమా హిట్ అయితే ఈ సినిమాను వదులుకున్న హీరో అతడే అంటూ కామెంట్ చేయడం కొద్దిగా రేర్ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా బేబీ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాను మొదట హీరో విశ్వక్ సేన్ ను అనుకున్నాను అని, ఆయన నో చెప్పాడు అని తెలిపాడు. అదే సినిమాను వేరొక హీరోతో తీసి హిట్ కొట్టి చూపిస్తాను అని శపథం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలపై విశ్వక్ ఇన్ డైరెక్ట్ గా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. నో మీన్స్ నో అంటూ ఒక ట్వీట్ వేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం నడిచింది.
Pekamedalu Teaser: వీడు లక్ష్మణ్ కాదు లత్కోర్.. ఆకట్టుకుంటున్న పేకమేడలు టీజర్
ఇక తాజాగా విశ్వక్ మీడియా ముందు సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు కొద్దిసేపటి క్రితం పేకమేడలు టీజర్ లాంచ్ చేసిన విశ్వక్.. ఆ ఈవెంట్ లో బేబీ సినిమా గురించి మాట్లాడుతూ.. ” నేను వచ్చేటప్పుడు మీమ్స్ చూస్తున్నా.. ఒకరిని పిలిచి.. గంటసేపు కథ విని నో చెప్పడం కంటే.. ముందే నో చెప్పడం మంచిది అని చెప్పిన ఆన్సర్ అది. నా పర్సనల్ ఛాయిస్ .. నేను చేద్దామనుకున్నా సినిమా.. ఆ సినిమా బాగోలేదని కాదు.. మూవీ టీమ్ కు కంగ్రాట్స్. కాకపోతే మన సినిమా బావుంటే .. మనం తలెత్తుకోవాలి.. తప్పు లేదు.. మన సినిమా బావుంది అని ఎవరినో కించపరచకూడదు.. అదొక్కటి బాధ అనిపించింది.. అన్ని సినిమాలు బావుండాలి” అని విశ్వక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
