టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘వెళ్లి పోమాకే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తరువాత అనేక సినిమాలలో తన నటనతో మెప్పించాడు. ఇక ఇప్పుడు యూత్ ఆడియన్స్ టార్గెట్ గా ‘లైలా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ భారీ సెన్సేషన్ సృష్టించగా, విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం, ప్రేక్షకుల లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
అంతే కాదు ఈ మూవీ లో పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘సోనూ మోడల్’ వీడియో సాంగ్ చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2nd సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా రిలీజైన ‘ఓహో రత్తమ్మ’ అనే సాంగ్ మారుమ్రోగుతుంది..ఎందుకంటే ఈ సాంగ్‌లో రీసెంట్ గా వైరల్ అయిన ‘కోయ్ కోయ్ కోడ్ని కోయ్’ పాట ఆడ్ చేశారు. దీంతో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేశారు మూవీ టీం.
ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ ఫిబ్రవరి 6న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు.లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ రాబోతుంది.ఇక లేడీ గెటప్ లో నటించడం యంగ్ హీరోలకు పెద్ద చాలెంజ్ అనే చెప్పాలి. మరి దీని విశ్వక్ ఎంత వరకు నిలుపుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ‘లైలా’ చిత్రంతో పాటు విశ్వక్ ‘ఫంకీ’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.