Vishwa Karthikeya Interview for Kaliyugam Pattanamlo: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో హీరో విశ్వ కార్తికేయ మంగళవారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన్ని ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ ఎందుకు పెట్టారని అడిగితే ప్రతీ మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వాటిని చూపించేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. నంద్యాలలో ఈ సినిమా కథ జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు ‘కలియుగం పట్టణంలో’ అని పెట్టామన్నారు.
Adivi Sesh: అడవి శేష్ సింగిల్ కాదు… బయట పెట్టిన డైరెక్టర్!
‘కలియుగం పట్టణంలో’ సినిమాలోని కాన్సెప్ట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. కలియుగం పట్టణంలో టెక్నికల్‌గా ఎంతో బాగుంటుంది. కెమెరా వర్క్‌కు అందరూ ఆశ్చర్యపోతారు. పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా వచ్చాయి. అజయ్ మాకు మంచి సంగీతాన్ని ఇచ్చారని అన్నారు. ఇండస్ట్రీ నుంచి నాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. హీరోలు, దర్శకులు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే వారు ఫిజికల్‌గా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుండేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఒక ఇండోనేషియా ప్రాజెక్ట్ చేస్తున్నా, ఆ మూవీలోనూ ఆయుషి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుందని అన్నారు. మంత్ర, తంత్రాలు, చేతబడుల నేపథ్యంలో ఆ సినిమా ఉండబోతోందని వెల్లడించారు.
