NTV Telugu Site icon

Vishnu Vishal: భర్త నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గుత్తా జ్వాల

Vishnu Vishal

Vishnu Vishal

Vishnu Vishal: ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోషూట్ ట్రెండ్ గా మారింది. ఏ ముహూర్తాన ఈ ట్రెండ్ ను రణవీర్ సింగ్ మొదలుపెట్టాడో .. ఒక్కో హీరో ఇదే పనిలో మునిగిపోతున్నారు. ఇప్పటికే న్యూడ్ గా రణవీర్ సింగ్ ను చేసి ఛీ ఛీ ఏంటీ దరిద్రం అనుకుంటున్న నెటిజన్లకు నేను కూడా రణవీర్ సింగ్ ను ఫాలో అవుతున్నాను అన్నట్లు కోలీవుడ్ స్టార్ హీరో నగ్నంగా ఫోజులిచ్చి సంచలనం సృష్టించాడు. ఆ హీరో ఎవరో కాదు విష్ణు విశాల్.. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్త. ప్రస్తుతం విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి మట్టి కుస్తీ.. ఈ సినిమను తెలుగులో రవితేజ నిర్మించడం విశేషం. ఈ కాంబోతో తెలుగులో కూడా సుపరిచితుడు అయ్యాడు విష్ణు.

ఇక హైదరాబాద్ అమ్మాయి గుత్తా జ్వాలను ద్వితీయ వివాహమాడిన ఈ హీరో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా విష్ణు విశాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బెడ్ పై న్యూడ్ గా పడుకొని ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా బెడ్ పై పడుకొని కాళ్ల వరకు దుప్పటిని కప్పుకొని కనిపించాడు. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ ” నేను కూడా ట్రెండ్ లో భాగమయ్యాను. అంతేకాకుండా ఈ ఫోటోలు తీసి నా భార్య గుత్తా జ్వాలా ఫోయోగ్రాఫర్ గా మారింది” అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఈ ఫోటోలను గుత్తా జ్వాలా తీసిందన్నమాట. ఇక ఈ ఫోటోలను మరోపక్క గుత్తా జ్వాలా కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఛీఛీ ఇదెక్కడి దరిద్రం.. ఇదెక్కడి ట్రెండ్ రా బాబు అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇక మరికొంతమంది రణవీర్ సింగ్ మిగతా వారిని కూడా చెడగొడుతున్నాడు అని తిట్టిపోస్తున్నారు.

Vishnu Vishal Latest Tweet: