Site icon NTV Telugu

Kannappa : కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన మోహన్ బాబు, విష్ణు..

Kannappa

Kannappa

Kannappa : కన్నప్ప రిలీజ్ కు రెడీ అయింది. ఇన్ని రోజులు వీఎఫ్‌ ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని విష్ణు రీసెంట్ గానే తెలిపాడు. తాజాగా ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది. ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్ లో మంచు విష్ణు, మోహన్ బాబు చూశారు. అయితే ప్రసాద్ ల్యాబ్స్ వద్ద భారీగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ కాపీ విషయంతో మోహన్ బాబు హ్యాపీగా ఫీల్ అయినట్టు మూవీ టీమ్ చెబుతోంది. మూవీ జూన్ 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Read Also : Peddi : అర్ధరాత్రి రామ్ చరణ్‌ యాక్షన్ సీన్స్..

ఇప్పటి వరకు మూవీ గురించి చాలా విషయాలు వారు చెబుతూనే ఉన్నారు. ప్రమోషన్లు భారీగానే చేస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉండబోతున్నట్టు సమాచారం. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ప్రభాస్ కూడా వస్తారని అంటున్నారు. అటు ఏపీలోని భీమవరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు చేశారు. వారు కూడా ప్రమోషన్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ నుంచి రేపు బిగ్ అప్డేట్..

Exit mobile version