Site icon NTV Telugu

Vishal : విజయ్ సినిమా డైరెక్ట్ చేసేందుకు విశాల్ యత్నం!

Vishal

Vishal

Vishal Reveals he tried to direct Thalapathy vijay: విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ‘రత్నం’ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతోంది.కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించగా యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్న క్రమంలో విశాల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఖాళీ సమయంలో ఉన్నప్పుడు కధలు రాసుకుంటూ ఉంటానని, ఒకసారి కథ రాసుకున్నాక దానికి విజయ్ అయితే సరిపోతాడని వెంటనే ఆయన మేనేజర్ కి కాల్ చేశానని అన్నారు. అయితే మేనేజర్ కన్ఫ్యూజ్ అయ్యాడని, హీరో విశాల్ హీరో విజయ్ ను డైరెక్ట్ చేస్తానని అనడం ఏమిటని ఆశ్చర్య పోయాడని అన్నారు. ఒక గంట-గంటన్నర అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగానని అన్నారు.

Amani: నటి ఆమని కాస్టింగ్ కౌచ్ కష్టాలు.. అవి చూపాలని ఒత్తిడి చేశారంటూ!

అయితే అది కుదరలేదని అనాన్రు. తనకి విజయ్ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్న ఆయన భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశం ఉంటే చేస్తానని అన్నారు. ఇక ఈసారి విశాల్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది, అందరికీ ఈ చిత్రంతో లాభాలు రావాలని అన్నారు. ఏప్రిల్ 26న మా మూవీ రాబోతోంది. నేను చివరి నిమిషం వరకు సినిమాను ప్రమోట్ చేస్తా, అది నా బాధ్యత. మీడియా వల్ల ఈ చిత్రం ఇంత వరకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ రాజేష్ వల్ల ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. మాతో కలిసిన ఆదిత్య మ్యూజిక్‌కు థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. హరి గారి చిత్రంలో హీరో కంటే హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుందని అన్నారు.

Vishal News

Exit mobile version