NTV Telugu Site icon

Vishal: వరలక్ష్మి నిశ్చితార్థం.. విశాల్ షాకింగ్ కామెంట్స్!

Vishal About Varalakshmi Sarathkumar

Vishal About Varalakshmi Sarathkumar

Vishal Reaction on Varalaxmi Sarathkumar Engagement: చెల్లమే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయం అయ్యాడు తెలుగు వాడైన విశాల్. ఆ త‌ర్వాత తామిరభరణి , చండ‌కోళి, తిమిరు వంటి మాస్ హిట్ చిత్రాల‌లో న‌టించి యాక్ష‌న్ హీరోగా ఎదిగాడు. విశాల్‌ను యాక్షన్ హీరోగా మార్చిన దర్శకులలో హరి ఒకరు. విశాల్ నటించిన తామిరభరణి, పూజై అనే రెండు చిత్రాలు బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. ఈ కాంబో ఇప్పుడు మూడోసారి సినిమా చేసింది. వీరి కలయికలో రత్నం అనే సినిమా రూపొందింది. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఇది ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Mr and Mrs Mahi: ధోనీపై జాన్వీ కపూర్ సినిమా.. రిలీజ్ డేట్ మారిందోచ్!

ఆ విధంగా రత్నం సినిమా ప్రమోషన్ కోసం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు విశాల్‌ను వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి, ఆమె నిశ్చితార్థం గురించి అడిగారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా విశాల్ కామెంట్ చేశారు. నిజానికి ఈ ఇద్దరి మధ్య గతంలో అఫైర్ ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఆ ప్రశ్నను విశాల్ స్కిప్ చేయచ్చు, కానీ అలా చేయకుండా వరలక్ష్మిని తలచుకుంటే చాలా సంతోషంగా ఉందని విశాల్ సమాధానమిచ్చాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి మార్కెట్‌ ఉందని అన్నారు. తిమిరులో శ్రేయారెడ్డి పాత్రతో మెస్మరైజ్ అయ్యాను, ఆ తర్వాత హనుమాన్‌లో వరలక్ష్మి పాత్ర మెస్మరైజింగ్‌గా అనిపించింది అని అనాన్రు. ఆమె జీవితాన్ని కెరీర్‌ని మించి తదుపరి దశకు తీసుకు వెళ్లడం ఆనందంగా ఉందని విశాల్ అన్నారు. కోలీవుడ్‌లో విశాల్, వరలక్ష్మి జంట గురించి కొన్నాళ్ల క్రితం జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ ప్రేమ బ్రేక్ అయిందని కూడా చెప్పుకున్నారు. ఇక మరోపక్క నికోలాయ్‌తో ప్రేమలో పడిన వరలక్ష్మి త్వరలో అతనిని పెళ్లాడబోతోంది.

Show comments