Site icon NTV Telugu

Vishal: అప్పుడే షూటింగ్ కంప్లీట్ అయ్యిందా… బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడున్నావే

Vishal

Vishal

తెలుగులో బోయపాటి శ్రీనుకి ఊరమాస్ డైరెక్టర్ గా ఎంత పేరుందో… కోలీవుడ్ లో డైరెక్టర్ హరికి అంత పేరుంది. ఓవర్ ది బోర్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ స్క్రీన్ ప్లే, సూపర్ ఫాస్ట్ కెమెరా మూమెంట్స్ హరి సినిమాల్లో హైలైట్ గా నిలుస్తున్నాయి. సూర్యతో ఆరు, సింగం, సింగం 2, దేవ సినిమాలు చేసిన హరికి కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుంది. మాస్ సినిమాలని మాత్రమే చేసే ఈ దర్శకుడు, తన నెక్స్ట్ సినిమాని విశాల్ తో చేస్తున్నాడు. విశాల్ తో ఇప్పటికే భరణి, పూజ సినిమాలు చేశాడు హరి. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు విశాల్ కి మంచి హిట్స్ గా నిలిచాయి. హిట్ కాంబినేషన్ గా పేరున్న హరి-విశాల్ హ్యాట్రిక్ హిట్ కొడతారని కోలీవుడ్ మూవీ లవర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ హౌజ్ అయిన స్టోన్ బెంచర్స్ మరియు జీ స్టూడియోస్ సౌత్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ‘విశాల్ 34’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి… ఆ తర్వాత ‘రత్నం’గా మారిపోయింది. మెడికల్ మాఫియాకి చెందిన కథతో రత్నం సినిమా తెరక్కుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. కొంతమంది మాత్రం యాక్షన్ లోకి దిగిన డాక్టర్ కథతో విశాల్ రత్నం రూపొందుతుందని అంటున్నారు. ఈ రెండింట్లో ఏది నిజం అనేది తెలియదు కానీ హరి-విశాల్-కార్తీక్ సుబ్బరాజ్ లు కలిసి సాలిడ్ మాస్ యాక్షన్ సినిమా చేస్తారు అని మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. అయితే 2023 జులైలో అఫీషియల్ గా అనౌన్స్ అయిన రత్నం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటూ విశాల్ ట్వీట్ చేసాడు. అంత ఫాస్ట్ గా యాక్షన్ సినిమాని ఎలా షూట్ చేసారు అంటూ విశాల్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరి మే 2024 రిలీజ్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమాతో విశాల్, హరి కలిసి మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version