Site icon NTV Telugu

Virupaksha: మెగా అభిమాని మరణించడంతో విరూపాక్ష టీజర్ వాయిదా…

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న మొదటి సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ గ్లిమ్ప్స్ బయటకి వచ్చి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ కోసం మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీజర్ ని లాంచ్ చేసేసాడు, మరి కొన్ని గంటల్లో విరూపాక్ష టీజర్ బయటకి వస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని న్యూస్ బయటకి వచ్చింది. SVCC ప్రొడక్షన్ హౌజ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి “సాయి ధరమ్ తేజ్ భీమవరం ఫాన్స్ ప్రెసిడెంట్ అయిన రావూరి పండు మరణించడంతో విరూపాక్ష టీజర్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నాం” అంటూ ట్వీట్ వచ్చింది.

Read Also: Vishwak Sen: ధమ్కీ డోస్ పెంచుతున్న ‘మాస్ కా దాస్’

ఊహించని ఈ ట్వీట్ చూసి మెగా అభిమానులు షాక్ అయ్యారు. తోటి మెగా ఫ్యాన్ మరణించడంతో మెగా ఫాన్స్ అంతా ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక ఫ్యాన్ మరణిస్తే తన సినిమా టీజర్ రిలీజ్ ని వాయిదా వెయ్యడం నిజంగా గొప్ప విషయం. తెలుగు టీజర్ మాత్రమే అయ్యి ఉంటే పర్లేదు కానీ పాన్ ఇండియా సినిమా కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన సమయానికి టీజర్ రిలీజ్ చెయ్యడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాంటిది అభిమాని కోసం సాయి ధరమ్ తేజ్ చేసిన పనికి మెగా ఫాన్స్ అంతా అభినందిస్తున్నారు.

Exit mobile version