టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో చితబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు సామ్యవాద పాలనే స్థాపించగా..” అంటూ రానా గంభీరమైన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. 1990ల నాటి వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందిన విరాట పర్వం యుద్ధ నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. రాజకీయ నాయకుల కింద అడివి బిడ్డలు నలిగిపోవడం చూడలేని రవన్న దళం వారికి అండగా ఉంటుంది.
సామ్యవాద పాలనను స్థాపించడానికి రవన్న తన ఆలోచనలను కవితలు గా రాసి ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ ఉంటాడు. ఆ కవితలకు వెన్నెల అనే యువతి ముగ్దురాలిగా మారి రవన్నను ప్రేమించడం మొదలుపెడుతుంది . అతడి కోసం అడివికి వెళ్తోంది. అక్కడికి వెళ్ళాకా ఆమెకు అనుకోని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని దాటుకొని వెళ్ళాలి అంటే ఆమె కూడా రవన్న దళంలో చేరి పోరాడుతుంది. ఆ తరువాత పచ్చని అడవుల్లో రావణకాష్టం ఎలా సాగింది? ఎవరు గెలిచారు..ఎవరు ఓడారు..? తచివరికి వెన్నెల తన ప్రేమను పొందిందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. ముందు నుంచి చెప్తున్నట్లే కథ అంతా సాయి పల్లవి చుట్టూనే తిరుగుతోందని తెలుస్తోంది. ఒక అమాయకపు ఆడబిడ్డగా , ప్రియుడి పక్కన తుపాకీ పేల్చే అణుబాంబు గా వెన్నెల నటన అద్భుతం.. సినిమా మొత్తం నక్సల్స్ – పోలీసుల యుద్ధం కనిపించినా అంతకుమిచ్చిన ఒక ఉద్వేగభరితమైన ప్రేమకథ ఉంది. ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసాడు డైరెక్టర్.. భారతక్క గా ప్రియమణి, మరో నక్సల్ గా నివేతా పేతురాజ్ కనిపించారు. మరి ఈ సినిమాతో రానా విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాలి.