Site icon NTV Telugu

Kohli Biopic: కోహ్లీ బయోపిక్? నేను చేయను – అనురాగ్ కశ్యప్

Virat Baipik

Virat Baipik

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి విరాట్ అభిమానులు అతడి జీవితం తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దీనిపై స్పందించారు.

Also Read : GV Prakash : ధనుష్‌ను మోసం చేయలేను – జీవీ ప్రకాష్

ఆయన మాట్లాడుతూ – “కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా. ఆయన వ్యక్తిత్వం అద్భుతం. కానీ ఒకవేళ నాకు కోహ్లీ బయోపిక్ చేసే అవకాశం వచ్చినా నేను చేయను. ఎందుకంటే, కోహ్లీ ఇప్పటికే కోట్లాది అభిమానుల కళ్లలో హీరో. చిన్న పిల్లలకే అతడిపై పిచ్చి. నేను బయోపిక్ చేయాలనుకుంటే, కష్టమైన సబ్జెక్ట్ ఎంచుకుంటాను. ఒక సాధారణ మనిషి జీవితం ఎలా మారిందో చూపించడమే నాకు ఇష్టం. కోహ్లీని వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఆయన త్వరగా ఎమోషనల్ అవుతాడు, నిజంగా హృదయపూర్వకమైన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే – కోహ్లీ ఓ అద్భుతం” అని అన్నారు.

ఇక కోహ్లీ బయోపిక్‌పై వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఒక పెద్ద బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతోందని రూమర్స్ వచ్చాయి. అంతేకాకుండా, ఆ సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కోహ్లీ పాత్ర పోషిస్తారని వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ సమయంలో రామ్ చరణ్ మాట్లాడుతూ – “కోహ్లీ నాకు చాలా ఇష్టమైన క్రికెటర్. అతడు ఎంతో మందికి స్ఫూర్తి. అవకాశం వస్తే అతని పాత్ర పోషించడం నా అదృష్టం. అది అద్భుత అనుభవం అవుతుంది” అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలా చూస్తే, కోహ్లీ బయోపిక్‌ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో ఇంకా అలాగే కొనసాగుతుంది.

Exit mobile version