NTV Telugu Site icon

Zombie Reddy: ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ పై వైరల్ అప్ డేట్

Untitled Design (11)

Untitled Design (11)

చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన సినిమాలో ‘జాంబిరెడ్డి’ ఒకటి.టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే  మంచి టాక్ ని సోంతం చేసుకుంది. ప్రేక్షకులకు పరిచయం లేని ఒక కొత్త సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో జాంబీస్ అనే పదం ప్రేక్షకులలో బాగా ఉండిపోయింది. కమెడితో పాటు, భయం, డివోషనల్‌ అని కలిపి చూపించాడు ప్రశాంత్.ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందనే విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ సీక్వెల్ కీ సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఎంటీ అంటే ‘జాంబిరెడ్డికి’ సీక్వెల్ కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ పూర్తి చేశాడట. అయితే కథ మాత్రమే ఇవ్వగలరు తప్ప దర్శకత్వం కానీ, పర్యవేక్షణ కానీ చేసే పరిస్థితిలో మాత్రం ప్రశాంత్ వర్మ లేరు. అందుకు గల కారణం ఆయనకు వేరే కమిట్మెంట్లు ఉండటం. అందువల్ల ఈ కథను తీసుకుని వేరే దర్శకుడితో చేసే ఆలోచనట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈసారి ఈ ప్రాజెక్ట్ ను సితార సంస్థ టేకప్ చేస్తుందట. దీంతొ సరైన దర్శకుడు దొరికిన వెంటనే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.