Site icon NTV Telugu

ఆ పాయింట్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి: ‘విరాజి’ దర్శకుడు ఇంటర్వ్యూ

Viraaji Director Interview

Viraaji Director Interview

Viraaji Director Aadhyanth Harsha Interview: మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన “విరాజి” ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ మీడియాతో పంచుకున్నాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. బయోటెక్నాలజీలో బీటెక్ చేసి ఫారిన్ వెళ్లి బయోటెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్ డీ ఇన్ న్యూరో సైన్స్ చేశా. అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేసి పది కథలు రాసుకున్నాను. 2019లో ఇండియాకు తిరిగి వచ్చా. దర్శకుడిని కావాలనేది నా కల. అదొక్కటే లక్ష్యంగా పని చేస్తూ వచ్చా, మూడు షార్ట్ ఫిలిమ్స్, 37 నిమిషాల నిడివితో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించా.

Average Student Nani: రొమాంటిక్గా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టీజర్

గతేడాది ‘విరాజి’ కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు చెప్పా, ఆయన నిర్మాత మహేంద్రనాథ్ గారికి పరిచయం. నా కథ బాగుందని వినమంటూ మహేంద్రకి ఆయన చెప్పడం, నేను వెళ్లి కథ చెప్పడం జరిగింది. ‘విరాజి’ కథ మహేంద్రనాథ్ కి బాగా నచ్చింది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా అని హీరోగా ఎవర్ని అనుకుంటున్నావ్ అని అడిగారు. నాకు మొదటి నుంచి ఈ సినిమా కోసం మైండ్ లో వరుణ్ సందేశ్ ఉండేవారు. వరుణ్ సందేశ్ ను కలిసి కథ చెప్పాను. ఆయన ఫస్టాఫ్ విని బాగుందన్నారు. సెకండాఫ్ విని గూస్ బంప్స్ వచ్చాయి మనం తప్పకుండా ఈ మూవీ చేద్దామన్నారు. అలా ‘విరాజి’ ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. సినిమా కంప్లీట్ చేశాక దాదాపు 4 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేశాం. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలు ఉన్నా…అండర్ కరెంట్ గా కొన్ని సోషల్ ఎలిమెంట్స్ చూపిస్తున్నాం. ఇప్పుడు సొసైటీలో ఉన్న ఒక కాంటెంపరరీ ఇష్యూని తెరపైకి తీసుకొస్తున్నాం. మీరు ‘విరాజి’ చూసి బయటకు వచ్చేప్పుడు ఆ పాయింట్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి అని అన్నారు.

Exit mobile version