Site icon NTV Telugu

Vinod Film Academy: నటనలో ఉండే టెక్నిక్ క్యాచ్ చేయాలి!

Vinod Film Academy

Vinod Film Academy

నటుడు వినోద్ నువ్వుల ఆధ్వర్యంలో నడుస్తున్న వినోద్ ఫిల్మ్ అకాడమీ దినదిన ప్రవర్ధమానమై మరింత ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత కృష్ణాజిల్లా లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ అన్నారు. మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాడమీతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుందని ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీదేవి ప్రసాద్ పేర్కొన్నారు. ఇక నటుడు ప్రదీప్ మాట్లాడుతూ నటనలో ఉండే టెక్నిక్ క్యాచ్ చేయాలని అన్నారు.

Salaar : సలార్ ఎఫెక్ట్.. బుక్ మై షో క్రాష్..

ఈ క్రమంలోనే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి అని ప్రముఖ దర్శకుడు ఏ మోహన్ గాంధీ విద్యార్థులను ఆశీర్వదించారు. మరో పక్క దొరసాని సినిమా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ కొత్త నటులకు అవకాశం ఇస్తూ ఉంటానని ప్రకటించారు. మాటల రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కోటి మంది మాత్రమే ఉంటారని అందులో తాము ఉండడం ఎంతో అదృష్టమని అన్నారు. అకాడమీ వ్యవస్థాపకుడు వినోద్ ప్రసంగిస్తూ.. తమ సంస్థ అందరికీ అందుబాటులో ఉందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ టెక్నాలజీ నిపుణులు నల్లమోతు శ్రీధర్, జబర్దస్త్ అప్పారావు, నటుడు సతీష్ , టిఏంటి డి ఎ యూ అధ్యక్షుడు రాజశేఖర్ ,బబ్లు, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. అకాడమీ ప్రిన్సిపాల్ కిషోర్ దాస్ వందన సమర్పణ చేయగా అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Exit mobile version