NTV Telugu Site icon

Kiran Abbavaram: అన్నమాచార్య వారసులను సన్మానించిన ‘వినరో భాగ్యము…’ చిత్ర బృందం

Vinaro

Vinaro

Vinaro Bhagyamu Vishnu Katha: మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళీ కిశోర్ అబ్బూరు ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుమల శ్రీ వేంటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలానే ఈ సినిమా షూటింగ్ అధిక భాగం తిరుపతిలోనే జరుపుకోవడంతో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సైతం అక్కడే జరిపారు. ఈ సినిమాలోని ‘వాసవ సుహాస’ గీతాన్ని కళా తపస్వి కె. విశ్వనాథ్‌ విడుదల చేయడం ఓ విశేషం. అలానే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ సమయంలో పన్నెండు తరాలకు సంబంధించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారసులను వేదికపై సన్మానించారు. ఇందులోని కొన్ని పాటలను సామాన్య ప్రేక్షకులతోనూ, మరికొన్ని పాటలను పెద్దలతోనూ విడుదల చేయించారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది.

Show comments