Site icon NTV Telugu

కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ పూర్తి

యూనివర్సల్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్ర యూనిట్ తాజాగా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసింది. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ అయిందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ మడ్ బైక్‌పై కూర్చొని ఉన్న పిక్ షేర్ చేశారు. ఈ ఫొటోలో కమల్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్, స్టంట్ మాస్టర్ డుయో అన్బరీవ్ కనిపిస్తున్నారు.
కాళిదాస్ జయరాం, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

Exit mobile version