Site icon NTV Telugu

Seeta The Incarnation: ప్రభాస్ ను మించేలా తెరపైకి మరో రాముడు..?

Vikram

Vikram

Seeta The Incarnation: తింటే గారెలే తినాలి.. వింటే రామాయణమే వినాలి అని నాటారు పెద్దలు.. రామాయణం ఎంత చదివినా.. రాముడు గురించి ఎంత తెల్సుకున్న తనివితీరదు. ఇక సినిమాలో రాముడిగా తమ ఫేవరెట్ హీరో చేస్తే బావుంటుందని ప్రతి ఒక్క అభిమాని కొరుకుతూ ఉంటాడు. ఆదిపురుష్ సినిమాతో ఆ భాగ్యం ప్రభాస్ ను వరించింది. అయితే టీజర్ రిలీజ్ అయ్యాకా ప్రభాస్ లుక్ పై ట్రోల్స్ వచ్చిన విషయం విదితమే.. ప్రభాస్ ను ఇంకా బాగా చూపించే పని అని, అసలు బొమ్మల సినిమాను తీసినట్లు తీసారని ట్రోల్స్ వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే తెరపైకి ఇంకో రాముడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకో రాముడు అంటే అదేంటి ప్రభాస్ ను రీప్లేస్ చేస్తున్నారా..? అనుకోకండి .. అలాంటిదేమీ లేదు. కథ మనకు తెలిసినా, ఎన్నిసార్లు రామాయణం చూసినా తీసే దర్శకులను బట్టి సినిమా మారుతూ ఉంటుంది. అందుకే జయలలిత బయోపిక్ ను రమ్యకృష్ణ చేసినా చూసాం.. కంగనా రనౌత్ చేసినా చూసాం. అలాగే బాలీవుడ్ లో కూడా మరో రామాయణం తెరకెక్కుతోంది. అదే సీత: ది ఇంకార్నేషన్. కంగనా రనౌత్ ఈ సినిమాలో సీతగా టైటిల్ రోల్ పోషిస్తోంది.

అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ ఫేమస్ రచయిత విజియేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమాను ప్రకటించినా ఇప్పటివరకు ఇది సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రాముడి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాత్ర నచ్చడంతో విక్రమ్ కూడా ఓకే అనేశాడని చెప్పుకొస్తున్నారు. ఇటీవలే విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ లో చోళ రాజు ఆదిత్య కరికాలాన్ గా నటించి మెప్పించాడు. ఇక చారిత్రాత్మక పాత్రల్లో విక్రమ్ జీవిస్తాడని చెప్పాలి. ఇక లుక్ పరంగా ఫిట్ నెస్ పరంగా విక్రమ్.. ప్రభాస్ కు ఈ మాత్రం తీసిపోడు.. అందుకే అతనిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదే కనుక నిజమైతే మరో రాముడు తెరపైనే కనిపించనున్నాడనే చెప్పాలి.

Exit mobile version