ప్రముఖ కథానాయకుడు చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘మహాన్’ చిత్రంలో నటిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్రమ్ తో పాటు ఆయన కుమారుడు ధృవ్ కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విక్రమ్ 61వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. గతంలో సూర్య, కార్తీతో సినిమాలు తీసిన వారి సన్నిహితుడైన జ్ఞానవేల్ రాజా కొంతకాలంగా ఇతర కథానాయకులతోనూ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విక్రమ్ తో జ్ఞానవేల్ రాజా నిర్మించే ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. 2012లో ‘అట్టకత్తి’తో తొలిసారి దర్శకుడిగా మారిన పా. రంజిత్ ఆ తర్వాత ‘మద్రాస్’తో పాటు రజనీకాంత్ హీరోగా వరుసగా ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు తెరకెక్కించాడు. అలానే ఇటీవలే ఆర్య తో ‘సర్పట్ట పరంబురై’ మూవీని తీశాడు. విక్రమ్ – పా. రంజిత్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
విక్రమ్ హీరోగా పా. రంజిత్ మూవీ!
