NTV Telugu Site icon

Swathistha: రజినీ కోడలు కత్తి అనుకుంటే… కమల్ కోడలు అమ్మోరు కత్తిలా ఉందే…

Swathistha

Swathistha

జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ వింటేజ్ వైబ్స్ ఇస్తూ కనిపించి ఉంటాడు. అనిరుధ్ ఈ జనరేషన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లా వినిపించి ఉంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ జైలర్ సినిమాని అన్ని సెంటర్స్ లో వసూళ్ల వర్షం రాబట్టేలా చేస్తుంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా జైలర్ పేరు మారుమోగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జైలర్ సినిమా నుంచి రజినీకాంత్, అనిరుధ్ పేర్లు కాకుండా ఇంకో పేరు వినిపిస్తోంది. అది మరెవరో కాదు కోడలి పాత్రలో నటించిన ‘మిర్నా’. వసంత్ రవి భార్య క్యారెక్టర్ లో, రజిని-రమ్యకృష్ణల కోడలుగా మిర్నా నటించింది. జైలర్ సినిమా నుంచి బయటకి వచ్చిన యూత్, ఈ అమ్మాయి ఎవర్రా ఇంత బాగుంది అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. తీరా మిర్నా ఫోటోలు చూస్తే సినిమాలో సాఫ్ట్ గా ఉంది బయటేమో ఇంత హాట్ గా ఉందేంట్రా అంటూ ఫొటోస్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు.

రజినీ రీల్ కోడలు కత్తి అయితే కమల్ రీల్ కోడలు అమ్మోరు కత్తి అనే చెప్పాలి. కమల్ హాసన్ కంబ్యాక్ ఫిల్మ్ గా నిలిచిన విక్రమ్ సినిమాలో… కమల్ కి కోడలు పాత్రలో నటించింది ‘స్వాతిష్ఠా కృష్ణన్’. ట్రెడిషనల్ అండ్ ట్రెండీగా కనిపించే స్వాతిష్ఠాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. స్వాతిష్ఠా చీర కట్టుకోని, బెడ్ పై పడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేవలం 20 సెకండ్లు ఉన్న ఈ వీడియో చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. విక్రమ్ సినిమాలో సైలెంట్ గా కనిపించిన స్వాతిష్ఠా, ఫొటోల్లో మాత్రం కాస్త గ్లామర్ గానే కనిపిస్తుంది. అందుకే స్వాతిష్ఠా కొత్త ఫోటోలు బయటకి రాగానే అవి ట్రెండ్ అవుతన్నాయి. మరి ఇప్పటివరకూ తమిళ్ కి మాత్రమే పరిమితం అయిన స్వాతిష్టాని తెలుగులోకి ఇంట్రడ్యూస్ ఎవరు చేస్తారో చూడాలి.

Show comments