Site icon NTV Telugu

Love Shade: ప్రేమలోని మాధుర్యాన్ని చూపించిన ‘విక్కీ ది రాక్ స్టార్’!

Vikky

Vikky

Vikky The ROCKSTAR – Love Shade

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘విక్కీ ది రాక్ స్టార్’. సి.ఎస్. గంటా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వర్దిని నూతలపాటి సమర్పణలో ఫ్లైట్ లెప్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియో, ఫస్ట్ షేడ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఇప్పుడు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించేలా ‘విక్కీ ది రాక్ స్టార్’ నుండి లవ్ షేడ్‌ను విడుదల చేశారు. ‘ఎంత బాగుందో.. ఇలా నీ పక్కన ఉండటం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంది.. ఐ వాంట్ టు స్టే ఫరెవర్’ అంటూ సాగే ఈ లవ్ షేడ్‌లో ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఇందులో రొమాంటిక్ సీన్స్, విజువల్స్ హృదయానికి హత్తకునేలా ఉన్నాయి. దీనికి సునీల్ కశ్యప్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ‘ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ, నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నామ’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సుభాష్, చరిత ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Bzdt0ZnkgP4&feature=youtu.be

 

Exit mobile version