Neethone Nenu Title Poster launched: బజ్జీల పాపగా పాపులర్ అయిన కుషిత కళ్లపు ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘నీతోనే నేను’ అనే సినిమా తెరకెక్కింది. అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తాజాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ ఇంత మంచి సినిమాను ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పారు. ఆయన ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని, మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. డైరెక్టర్ గారు పైకి ఎంతో సైలెంట్‌గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం వయలెంట్ అని, అంజిరామ్ గారు కథ చెప్పినప్పుడే ఓకే చెప్పానని అన్నారు.
ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారని అన్నారు. ఇక హీరోయిన్ కుషిత కళ్లపు మాట్లాడుతూ ‘‘నీతోనే నేను మంచి లవ్ స్టోరి అని, అన్ని ఎమోషన్స్ ఉంటాయని అన్నారు. డైరెక్టర్ అంజిరామ్‌గారు చక్కగా సినిమా చేశారని, త్వరలోనే మీ ముందుకు వస్తామని చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పారు. కథ విన్నవెంటనే బాగా నచ్చిందని, లక్కీ లక్ష్మణ్ వంటి చిత్రం తరువాత ఇలాంటి మంచి కథ రావడం ఆనందంగా ఉందని అన్నారు. డైరెక్టర్ అంజిరామ్ గారితో ఇది నాకు రెండో సినిమా అని పేర్కొన్న ఆమె కెమెరామెన్ గారు మా అందరినీ అందంగా చూపించారని అన్నారు. సినిమా బండి తరువాత వికాస్ గారి పేరు ఎక్కువగా వినిపించిందని ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని అన్నారు.