తుపాకీ, అదిరింది, మాస్టర్, వారసుడు సినిమాలతో తెలుగులో కూడా మార్కెట్ పెంచుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. లేటెస్ట్ గా లియో సినిమాతో తెలుగులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టిన విజయ్, తమిళ్ నుంచి తెలుగులో వచ్చి అత్యధిక మార్కెట్ సాధించిన హీరోల లిస్టులో టాప్ 5లోకి చేరిపోయాడు. తెలుగులో రజినీకాంత్, కార్తీ తర్వాత ఆ స్థాయి ఓపెనింగ్స్ ని అవలీలగా రాబడుతున్నాడు విజయ్. అందుకే విజయ్ నుంచి సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా దాని గురించి చర్చ జరుగుతోంది. లియో సినిమా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విజయ్… ఈసారి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి సినిమా చేస్తున్నాడు. దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న దళపతి 68 మూవీలో… జయరామ్, ప్రభుదేవా, యోగిబాబు, ప్రశాంత్, స్నేహ, లైలా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎప్పటిలాగే వెంకట్ ప్రభు మ్యూజిక్ భద్యతలని యువన్ శంకర్ రాజాకి అందించాడు. వెంకట్ ప్రభు సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, థీమ్ మ్యూజిక్ ఇవ్వడంలో యువన్ స్టయిలే వేరు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ కోసం విజయ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తే దళపతి 68 ఫస్ట్ లుక్ ని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి లాంచ్ చేయనున్నారు. ఈ ఫస్ట్ లుక్ బయటకి రావడం ఆలస్యం సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి విజయ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. తన ప్రతి సినిమాకీ… వెంకట్ ప్రభు పాలిటిక్స్, వెంకట్ ప్రభు రీయూనియన్, వెంకట్ ప్రభు గేమ్ లాగా ఈసారి ఎలాంటి కొటేషన్ తో సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీతో విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఫస్ట్ లుక్ తో పాటు దళపతి 68 టైటిల్ ని కూడా రివీల్ చేస్తారా లేదా అనేది చూడాలి.
Are you ready for #Thalapathy68FirstLook ?@actorvijay Sir @vp_offl @thisisysr @aishkalpathi @Ags_production @TSeries @PharsFilm pic.twitter.com/4l3WiqIdqt
— Archana Kalpathi (@archanakalpathi) December 31, 2023
