Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే

Vijay Jananayagan

Vijay Jananayagan

కోలీవుడ్ హిస్టరీలోనే జననాయగన్ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను నమోదు చేస్తుందని ఆశించిన అభిమానులకు, ట్రేడ్ వర్గాలకు ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ కొంత నిరాశను కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుత ట్రెండ్ ని పరిశీలిస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ కూలీ లేదా విజయ్ గత చిత్రం లియో సృష్టించిన ఓపెనింగ్స్ రికార్డులను అందుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

ప్రస్తుత తరుణంలో ఈ సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను అయినా సాధించగలదా అన్నదే ట్రేడ్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా విజయ్ నటించిన గత చిత్రాలకు కనిపించే వారాంతపు బుకింగ్స్ రద్దీ మరియు అడ్వాన్స్ టికెట్ సేల్స్ జోరు, ఈ సినిమా విషయంలో ఆ స్థాయిలో కనిపించడం లేదు. ఈ చిత్రానికి సంబంధించి గతంలో జరిగిన కొన్ని నెగెటివ్ పరిణామాలు సినిమా ప్రీ-రిలీజ్ హైప్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం అలాగే పలుమార్లు విడుదల వాయిదా పడటం వంటి అంశాలు సినిమాపై ఉన్న సహజమైన ఊపును తగ్గించేశాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే గనుక పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ గమనం పూర్తిగా మారిపోయి కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంతటి భారీ ఓపెనింగ్‌ను రాబట్టడం ఏ ఇతర స్టార్ హీరోకైనా దాదాపు అసాధ్యమైన పనే అని చెప్పాలి. కానీ సినిమాకు వ్యతిరేకంగా ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్క విజయ్ స్టార్‌డమ్ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ మాత్రమే జననాయగన్ చిత్రాన్ని కోలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా మారుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.