Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హిస్టరీలోనే జననాయగన్ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను నమోదు చేస్తుందని ఆశించిన అభిమానులకు, ట్రేడ్ వర్గాలకు ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ కొంత నిరాశను కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుత ట్రెండ్ ని పరిశీలిస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ కూలీ లేదా విజయ్ గత చిత్రం లియో సృష్టించిన ఓపెనింగ్స్ రికార్డులను అందుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
ప్రస్తుత తరుణంలో ఈ సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను అయినా సాధించగలదా అన్నదే ట్రేడ్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా విజయ్ నటించిన గత చిత్రాలకు కనిపించే వారాంతపు బుకింగ్స్ రద్దీ మరియు అడ్వాన్స్ టికెట్ సేల్స్ జోరు, ఈ సినిమా విషయంలో ఆ స్థాయిలో కనిపించడం లేదు. ఈ చిత్రానికి సంబంధించి గతంలో జరిగిన కొన్ని నెగెటివ్ పరిణామాలు సినిమా ప్రీ-రిలీజ్ హైప్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఆన్లైన్లో లీక్ కావడం అలాగే పలుమార్లు విడుదల వాయిదా పడటం వంటి అంశాలు సినిమాపై ఉన్న సహజమైన ఊపును తగ్గించేశాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే గనుక పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ గమనం పూర్తిగా మారిపోయి కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంతటి భారీ ఓపెనింగ్‌ను రాబట్టడం ఏ ఇతర స్టార్ హీరోకైనా దాదాపు అసాధ్యమైన పనే అని చెప్పాలి. కానీ సినిమాకు వ్యతిరేకంగా ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్క విజయ్ స్టార్డమ్ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ మాత్రమే జననాయగన్ చిత్రాన్ని కోలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా మారుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!