Black & White:గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బి అండ్ డబ్ల్యూ. పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి దీనిని నిర్మిస్తుండగా, ఎస్‌ఆర్ ఆర్ట్స్, ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ సహకారంతో ఎ మేఘనా రెడ్డి సమర్పిస్తున్నారు. ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను లెజెండరీ రైటర్, రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. టీజర్‌ను లాంచ్ చేసిన అనంతరం చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.
ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే ట్రైలర్ సైతం బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో సాగింది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ మధ్యలో గ్లామర్ పాత్రలు తగ్గించి, పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న డీ గ్లామర్ పాత్రలు చేసింది. మళ్ళీ ఆమె తన పాత రూట్ లోకి వచ్చినట్టు ఈ ట్రైలర్ లోని గ్లామర్ ట్రీట్ చూస్తుంటే అర్థమౌతోంది. ”నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్” అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సూర్య శ్రీనివాస్‌తో సహా చాలా పాత్రలను టీజర్‌లో అనుమానాస్పద రీతిలో చూపించారు. లహరి, నవీన్ నేని పాత్రలు సైతం టీజర్ లో చోటు చేసుకున్నాయి. ఉత్కంఠభరితమైన ఈ టీజర్ లో యూత్ కు నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. టీజర్ కట్‌తో దర్శకుడు సూర్య ప్రకాష్ మూవీపై ఆసక్తిని రేకెత్తించాడు. ఈ సినిమాకు టి.సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతుందని టీజర్ చూస్తే అర్థమౌతోంది. అజయ్ అరసాడ స్వరాలు సమకూర్చిన ‘బి&డబ్ల్యూ’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
