Site icon NTV Telugu

Vijay Sethupathi : ‘బెగ్గర్’, ‘మాలిక్’ కాదు.. విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ సినిమా టైటిల్ ఇదే!

Porijaganadh

Porijaganadh

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో పూరి జగన్నాథ్ కు ఉండే ఫ్యాన్ బేస్ వేరు. కానీ చాలా కాలంగా వరుస పరాజయాలతో ఉన్న పూరి జగన్నాథ్  లైగర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి, అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో.. పూరీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక్క సారిగా తమిళ స్టార్ విజయ్  సేదుపతితో సినిమా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయ్ సేతుపతి‌తో పాటు సంయుక్తా, టబు, విజయ్, బ్రహ్మాజీ, వీ టీవీ గణేష్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జెబీ మోషన్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ..

Also Read : Deepika Padukone: ‘ట్రిపుల్ ఎక్స్‌’ సీక్వెల్‌తో.. మరోసారి హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న దీపికా పదుకొణె

సెప్టెంబర్ 28న టైటిల్, టీజర్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా రేపు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో అధికారికంగా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యం ఈ సినిమా కోసం ‘బిక్షాందేహి’, ‘మాలిక్’, ‘బెగ్గర్’ వంటి టైటిల్స్ వైరల్ అయినప్పటికి. చివరికి.. ‘స్లమ్‌డాగ్’ అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు. ఈ టైటిల్ ద్వారానే కథలోని పేదవాడి నుంచి ధనవంతుడిగా మారే ప్రయాణం లేదా, అతని జీవితంలో జరిగే భారీ మార్పు గురించి ఉంటుందని తెలుస్తుంది. కాగా  మూవీ ఆయన కెరీర్‌కు మళ్లీ హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version