విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ టాలెంటెడ్ నటుడు కోలీవుడ్ చిత్రాల లో మాత్రమే కాకుండా తెలుగు మరియు హిందీ భాషలో కూడా నటిస్తున్నారు.ఉప్పెన సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగు లో డబ్ అవుతూ వచ్చాయి.. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నయనతార హీరో హీరోయిన్లు గా నటించిన జవాన్ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు..ఈ సినిమా ద్వారా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.ఇక ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రపంచవ్యాప్తం గా అత్యధిక థియేటర్లలో విడుదలకు రెడీ అవుతుంది.ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ మొదలుపెట్టారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో విజయ సేతుపతి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు షారుఖ్ ఖాన్ తో కలిసి ఎప్పటి నుంచో నటించాలని కోరిక ఉండేదని ఆయన తెలిపారు. అయితే ఆ కోరిక అట్లీ వల్ల నెరవేరీనందుకు డైరెక్టర్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ షారుక్ ఖాన్ కోసమే తాను ఈ సినిమాలో నటించానని ఆయన తెలిపారు.. ఇలా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ అవకాశం రావడంతో తాను ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆయన తెలిపారు.అయితే జవాన్ సినిమాలో నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా తాను ఈ సినిమాలో తప్పకుండా నటించేవాడిని అంటూ ఈ సందర్భంగా విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేసింది.