Site icon NTV Telugu

Vijay: దళపతి విజయ్ కి మరో షాక్!

Vijay

Vijay

ఇప్పటికే వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీవీకే అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ కి మరో భారీ షాక్ తగిలింది. నిజానికి సంక్రాంతి సమయంలో రిలీజ్ కావాల్సిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ ఇబ్బందులతో రిలీజ్ కాలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాని తమిళ డైరెక్టర్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేశారు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమా, మన తెలుగు ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారం ఉంది. కానీ దాన్ని పలుసార్లు సినిమా యూనిట్ ఖండిస్తూ వచ్చింది.

Also Read:Akira Nandan: అకిరా నందన్ ఎంట్రీపై పవన్ కీలక వ్యాఖ్యలు

అయితే తాజాగా ఈ సినిమా విషయంలోనే విజయ్ కి షాక్ తగిలింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్, ఆ డీల్ రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. నిజానికి విజయ్ కి ఉన్న క్రేజ్, సినిమా మీద ఉన్న బజ్ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాను మొత్తానికి 120 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం చెప్పిన సమయానికి సినిమా విడుదల కాకపోవడంతో పాటు, సెన్సార్ కాకపోవడంతో డీల్ నుంచి ప్రైమ్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ప్రస్తుతానికైతే రాలేదు కానీ, వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version