NTV Telugu Site icon

GOAT Vijay: తెలుగు ‘గోట్’కి భారీ దెబ్బే.. కానీ?

The Goat

The Goat

Vijay GOAT Movie Disappointig Collections in Telugu: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే తమిళంలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం మొదటి ఆట నుంచి దారుణమైన మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ డిజాస్టర్ టాక్ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద గట్టిగానే పడింది. ఈ సినిమా మొత్తాన్ని తెలుగు వర్షన్ 23 కోట్లకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే ఇప్పటివరకు దాదాపు 9 కోట్లు మాత్రమే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా చెబుతున్నారు.

ARM Movie Review: ఏఆర్ఎమ్ రివ్యూ: మలయాళ స్టార్ టోవినో థామస్ సినిమా ఎలా ఉందంటే?

దీంతో ఈ సినిమా విషయంలో భారీగా నష్టపోవాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. అయితే సినిమాని అడ్వాన్స్ బేసిస్ మీదే రిలీజ్ చేశారనే వాదన వినిపిస్తోంది. అలా అయితే కొంత సేఫ్ సైడ్ లో ఉన్నట్టే. ఇక మరో వాదన ప్రకారం గోట్ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ పుష్ప 2 సినిమాని తమిళ్ లో రిలీజ్ చేస్తోంది. ఆ ఫ్రెండ్షిప్ తో ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇక్కడ కాస్త నష్టపోయినా ఇబ్బంది లేదని ఫిక్సయినట్లుగా చెబుతున్నారు. ఇక దాదాపుగా ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ స్టార్ హీరోల సినిమాలన్నింటినీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఒకప్పుడు దిల్ రాజుకు వెళ్లే సినిమాలు ఇప్పుడు మైత్రి వద్దే ఆగిపోతున్నాయి.

Show comments