Site icon NTV Telugu

Vijay Devarakonda: అక్కడ విజయ్ ఫేస్ టాటూ వేయించుకున్న అమ్మాయి.. విజయ్ ఏమన్నాడంటే..?

Vijay

Vijay

సాధారణంగా ప్రతి హీరోకు ఫ్యాన్స్ ఉంటారు.. కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వారు హీరోల పేర్లను చేతుల మీద వీపు మీద పచ్చ బొట్టు పొడిపించుకుంటూ ఉంటారు. అది అందరికి తెల్సిన విషయమే.. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒక అమ్మాయి తన ఫేవరెట్ హీరో ముఖాన్ని మొత్తం పచ్చబొట్టు పొడిపించుకోవడం.. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? ఇంకెవరు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు చిత్రంతో వెండితెరపై హీరోగా పరిచయమైన విజయ్ అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు.. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అర్జున్ రెడ్డి నుంచి విజయ్ స్టైల్ కు ఎంతోమంది ఫిదా అయిపోయారు.

ముఖ్యంగా అమ్మాయిలు.. రౌడీ బేబీ అంటూ విజయ్ ను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఆ అభిమానాన్ని ఒక అమ్మాయి టాటూ రూపం లో చూపించింది. డాక్టర్ చెర్రీ అనే యువతి విజయ్ దేవరకొండ ముఖాన్ని తన వీపు కింద భాగంలో పచ్చ బొట్టు పొడిపించుకున్నది. ఇక ఈ వీడియో చూసిన విజయ్, తన ఫ్యాన్ గర్ల్ ను పర్సనల్ గా కలిసి మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన అభిమాన హీరోను చుసిన చెర్రీకి నోటి మాట రాలేదు.. తన్మయంతో విజయ్ ను అలా చూస్తూ ఉండిపోయింది. ఇక విజయ్ తో పాటు పూరి, ఛార్మీ కూడా వారిని రిసీవ్ చేసుకున్నారు. కొద్దిసేపు విజయ్, ఫ్యాన్ గర్ల్స్ తో మాట్లాడి.. టాటూ వేయించుకున్నప్పుడు నొప్పి రాలేదా..? ఇలాంటివి చేయకండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే విజయ్ ప్రస్తుతల్ లైగర్ షూటింగ్ ను పూర్తి చేసి జనగణమణ ను మొదలుపెట్టాడు.

Exit mobile version