రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తాగుడు బాగా ఎక్కువైందట… ఈ మాట మేము అనట్లేదండీ… ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ స్టార్ హీరో రష్మిక మందన్నతో కలిసి ఇటీవల ముంబైలో డేట్ కి వెళ్ళాడు. విజయ్, రష్మిక మందన్న డిన్నర్ డేట్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, అభిమానులు వాళ్లిద్దరూ క్యూట్‌గా కనిపిస్తున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు మరోమారు పుకార్లు బయలుదేరాయి. అయితే వీడీ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని తెలుపుతూ రష్మిక ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా విజయ్ అదే యానిమల్ ప్రింట్ షర్ట్ ధరించి ఉన్న ఫోటోను పంచుకుంటూ తనకు తాగుడు బాగా ఎక్కువైందని అంటున్నాడు. బహుశా రష్మిక మందన్న ఈ పిక్ ని క్లిక్ చేసి ఉండవచ్చు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫోటోను పంచుకుంటూ “నేను గత వారం నుంచి చాలా మద్యపానం సేవిస్తున్నాను!” అంటూ కామెంట్ పెట్టాడు.
Read Also :
కాగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి నటించిన ‘లైగర్’ అనే పాన్-ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరోవైపు అల్లు అర్జున్‌తో కలిసి నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రం విజయంతో రష్మిక దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత కూడా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.