Site icon NTV Telugu

Kushi Shooting: ఖుషీ సినిమాకి గుమ్మడి కాయ కొట్టేశారు..ఇక ఫోకస్ దానిమీదే

Kushi Movie Shoot Completed

Kushi Movie Shoot Completed

Kushi Shooting Wrapped: లైగర్ లాంటి డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ చేస్తున్న సినిమా ఖుషీ. పవన్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా చెప్పుకునే ఖుషీ సినిమా టైటిల్‌ ఈ సినిమాకి కూడా పెట్టడంతో ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత విజయ్ సరసన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ కోసం ఇప్పటి దాకా రిలీజైన పోస్టర్‌లు, సాంగ్స్ సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఇక గతేడాది షూటింగ్‌ ప్రారంభించిన ఈ సినిమా సమంత అనారోగ్యానికి గురి కావడంతో కొన్ని రోజుల పాటు బ్రేక్‌లు పడ్డాయి, తిరిగి ఈ ఏడాది ప్రథమార్థంలో షూటింగ్‌ ప్రారంభించి బ్యాక్‌ టు బ్యాక్‌ షెడ్యూల్స్‌తో సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక తాజాగా ఈ సినిమా షూట్ పూర్తయిందని ప్రకటించారు. సినిమా దర్శక నిర్మాతతో విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫొటోలు కూడా షేర్ చేశారు.

Jaanavule Lyrical Video: తమన్ ‘జాణవులే’ అంటుంటే బాగుంది ‘బ్రో’!

ఇక నిజానికి ఈ సినిమాకి కొన్నాళ్ల క్రితం గుమ్మడికాయ కొట్టేశారని చెబుతూ షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. కుటుంబ సభ్యులంతా గుడిలో యాగం చేస్తున్నట్టు వీడియోలో చూపించగా అందులో సమంత రెడ్ కలర్ చీర, విజయ్ షర్ట్ ధరించి పంచ కట్టుకున్నాడు. అయితే మరి ఇప్పుడు సినిమా షూట్ ముగించినట్టు యూనిట్ మరోమారు ప్రకటించింది. బహుశా ప్యాచ్ వర్క్ అయి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కాశ్మీర్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుండగా లైగర్‌తో కోలుకోలేని దెబ్బ తిన్న విజయ్‌ ఈ సినిమాతో భారీ కంబ్యాక్‌ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ సైతం టక్‌ జగదీష్ సినిమా తర్వాత ఈ సినిమాతో మంచి కంబ్యాక్‌ ఇవ్వాని చూస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న పాన్‌ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ రిలీజ్‌ కానుంది.

Exit mobile version