NTV Telugu Site icon

Khusi: సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్

Khusi

Khusi

రౌడీ హీరో ‘ది’ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ “నా రోజా నువ్వే” లిరికల్ వీడియో బయటకి వచ్చింది. ఇప్పటివరకు 53 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. ఈ మెలోడీ సాంగ్ ని శివ నిర్వాణ స్వయంగా రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ పాడడం విశేషం. సాంగ్ కి అవసరమైన లిరిక్స్ ని, అందరికీ అర్ధం అయ్యే భాషలో శివ నిర్వాణ చాలా బాగా రాసాడు. సాంగ్ లో మణిరత్నం సినిమా టైటిల్స్ ఎక్కువగా వినిపిస్తాయి, దీని కారణంగా సాంగ్ వినగానే క్యాచీగా అనిపించి, రిపీట్ మోడ్ లో విన్నారు. లిరికల్ సాంగ్ లో చూపించిన విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి, కాశ్మీర్ అందాలని బాగా క్యాప్చర్ చేసినట్లు ఉన్నారు.

ఈ సాంగ్ లో విజయ్, సామ్ పెయిర్ చూడడానికి చాలా బాగున్నారు. ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఖుషి సినిమాకి యాడెడ్ అస్సేట్ అవ్వనుంది. తెలుగులో టాప్ ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ ని మరిపించే రేంజులో సెకండ్ సాంగ్ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సెకండ్ సాంగ్ గురించి ట్వీట్ చేస్తూ… త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని చెప్పారు. నా రోజా నువ్వే సాంగ్ లా సెకండ్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయితే సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఖుషి మూవీపై మరింత హైప్ పెరిగడం పక్కా. మరి ఈ మూవీతో సామ్, విజయ్, శివ నిర్వాణ సాలిడ్ కంబ్యాక్స్ ఇస్తారో లేదో చూడాలి.

Show comments