Ranabaali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్‌పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabaali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు మంచి ఆదరణ పొందడంతో, మూడోసారి వీరిద్దరూ జతకట్టిన ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనౌన్స్ అయినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ విడుదల తేదీపై కొత్త చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ‘రణబాలి’ అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 11 విడుదలను వాయిదా వేసి అక్టోబర్‌లో కొత్త తేదీని ఖరారు చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు కూడా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల విషయంలో విడుదల తేదీల్లో మార్పులు జరగడం కొత్త విషయం కాదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు చివరి నిమిషంలోనూ నిర్ణయాలు మార్చడం చూస్తూనే ఉన్నాం. అదే తరహాలో ‘రణబలి’ విషయంలో కూడా జరగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ‘రణబాలి’ నిలవనుండగా, రష్మిక మందన్నతో ఆయన కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం విడుదల తేదీ మార్పుపై జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ‘రణబాలి’ రిలీజ్ డేట్‌పై నెలకొన్న ఉత్కంఠ మాత్రం కొనసాగనుంది.
తాజావార్తలు
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?