Site icon NTV Telugu

The Family Star: కలియుగ రాముడు వచ్చిండు కాకో… మడతపెట్టి కొడితే?

Family Star Teaser

Family Star Teaser

Family Star Teaser: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా టీజర్ అనేక వాయిదాల అనంతరం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తుండగా ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఇక ఎట్టకేలకు ఇవాళ “ఫ్యామిలీ స్టార్” టీజర్ రిలీజ్ చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ‘దేఖొరో దెఖో..’ సాంగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది.

Chandini Chowdary: ‘గామి’ షూట్ లో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డా : హీరోయిన్ చాందినీ చౌదరి ఇంటర్వ్యూ

సర్ నేమ్ కి సరెండర్ అయి, ఫ్యామిలీ అంటే వీక్ నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్ లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుని తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు హీరో. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు, అతను వేస్తే బడ్జెట్ షాక్, ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్ అవుతుంది. టీజర్ చివరలో హీరోయిన్ మృణాల్ ‘నేను కాలేజ్ కు వెళ్ళాలి. కొంచెం దించేస్తారా..’ అని అడిగితే..’లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ అంటారు హీరో. ఇలా హీరో క్యారెక్టర్ లో ఉన్న హోమ్లీ, మ్యాన్లీ, లవ్ లీనెస్ తో టీజర్ ఇంప్రెస్ చేసేలా కట్ చేశారు. ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ కంప్లీట్ మూవీని షార్ట్ గా చూసిన ఫీలింగ్ కలిగించింది. ఈ సమ్మర్ కు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా “ఫ్యామిలీ స్టార్” సినిమా ఉండబోతున్నట్లు టీజర్ హింట్ ఇస్తోంది.

Exit mobile version